Friday, September 20, 2024
HomeతెలంగాణBhimgal: కేసిఆర్ లక్ష్యం-ప్రతి ఎకరాకు నీరు

Bhimgal: కేసిఆర్ లక్ష్యం-ప్రతి ఎకరాకు నీరు

ప్యాకేజీ 21 ద్వారా బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్, వేల్పూర్,కమ్మర్ పల్లి మండలాల్లో మోర్తాడ్ మండలంలో సగ భాగం మొత్తం సుమారు 80 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి అయ్యాయని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

- Advertisement -

గురువారం నాడు మంత్రి బడా భీంగల్ వద్ద కప్పల వాగు పై నిర్మించిన ప్యాకేజీ 21 పైప్ లైన్ ఔట్ లెట్,చింతలూరు వద్ద పెద్ద వాగుపై నిర్మించిన ఔట్ లెట్ పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…

ముఖ్యమంత్రి కేసిఆర్ దయతో వారి ఆలోచనలకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ 21 లో భాగంగా చేపట్టిన సారంగాపూర్ పంప్ హౌస్, మెంట్రాజ్ పల్లి పంప్ హౌస్ నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. మెయిన్ పైప్ లైన్ కూడా కంప్లీట్ అయ్యిందని, ఇప్పటి వరకు సాగు నీరు అందే అవకాశం లేని బాల్కొండ నియోజకవర్గంలోని మండలాలకు సుమారు 1150 కోట్ల రూపాయలతో 80వేల ఎకరాలకు సాగునీరు అందించే ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎస్సారెస్పీ బినోల నుండి మెంట్రాజ్ పల్లి పంప్ హౌస్ నుండి పైప్ లైన్ ద్వారా కప్పల వాగు,పెద్ద వాగు త్వరలో నీళ్లు నింపుకునే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. చింతలూరు వద్ద ఔట్ లెట్ వర్క్స్ కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయని త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. గత నాలుగు సీజన్లుగా వర్షాలు బాగా పడి రైతులు పొలాల్లో పైప్ లైన్ వేసే అవకాశం ఇవ్వలేదని, చేంగల్,పచ్చలనడుకుడ బడా భీంగల్ గ్రామాల్లో ప్రతి నాలుగు ఎకరాలకు సాగు నీరు అందించే పైప్ లైన్ పాయింట్స్ ఇప్పటికే పూర్తి అయ్యాయని మిగతా గ్రామాల రైతులు కూడా సహకరించాలని కోరారు. ఈ ప్రాంత రైతాంగం పక్షాన సీఎం కేసిఆర్ కు మంత్రి ధన్యావాదాలు తెలిపారు.

మంత్రి వెంట జలవనరుల శాఖ అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News