భూధాన్ పోచంపల్లి మండలం లోని జిబ్లక్ పల్లి, అంతమ్మ గూడెం గ్రామాల్లో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు. జిబ్లక్ పల్లి గ్రామంలో 16 లక్షల వ్యయంతో నిర్మించిన పశు వైద్య ఉపకేంద్ర నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు అక్కడే ఉన్న గ్రామస్తులను తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతమ్మ గూడెంలో గ్రామంలో పర్యటించి గ్రామంలో ఏర్పాటు చేసిన వీధి దీపాలు, పశువుల నీటి తొట్టి, బీరప్ప గుడి చుట్టు నిర్మించిన ప్రహరీ గోడ ను ప్రారంభించారు.
సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో 20 లక్షల వ్యయం తో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి గ్రామం కూడా అభివృద్ధి అవుతుందని ఈ గడిచిన నాలుగేళ్ళలో అంతమ్మ గూడెం గ్రామానికి 1కోటి 4 లక్షల రూపాయలు నిధులు వెచ్చించి నూతనంగా ఏర్పడ్డ ఈ పంచాయితీలో పలు అభివృద్ధి పనులు చేశాం అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, పోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు బత్తుల మాధవి శ్రీశైలం, జిబ్లక్ పల్లి సర్పంచ్ చిన్న లచ్చి లింగస్వామి, అంతమ్మ గూడెం సర్పంచ్ వస్పరి పారిజాత మహేష్, ఉపసర్పంచ్లు ఆర్ల లింగస్వామి, గద్మీ జయ నరేందర్ రెడ్డి, రైతు సంఘం మండల కన్వీనర్ రావుల శేఖర్ రెడ్డి, వార్డు మెంబర్లు, టిఆర్ఎస్ పార్టీ మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.