Sunday, July 7, 2024
HomeతెలంగాణBichkunda: బతుకమ్మ చీరల పంపిణి చేసిన ఎమ్మెల్యే

Bichkunda: బతుకమ్మ చీరల పంపిణి చేసిన ఎమ్మెల్యే

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఎమ్మెల్యే

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గోపన్ పల్లి గ్రామములో ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసారు. అనంతరం గోపనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రారంభించారు. బసవేశ్వర భవన్ నిర్మాణానికి భూమి పూజ చేసి బతుకమ్మ చీరల పంపిణీ, కేసిఆర్ స్పోర్ట్స్ కిట్ లను జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ సిందే పంపిణి చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎంపీపి అశోక్ పటేల్, వైస్ ఎంపీపీ రాజు పటేల్, జెడ్పీటీసీ భారతి రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, పార్టీ ప్రెసిడెంట్ వెంకట్రావు దేశాయ్, సొసైటీ చైర్మన్ నాల్చార్ బాలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బసవరాజ్ పటేల్, స్థానిక సర్పంచ్ కొట్టే శ్రీనివాస్, ఎంపీటీసీ భర్త రాములు, సొసైటీ డైరెక్టర్ శివరాజ్ పటేల్, పుల్కల్ సొసైటీ చైర్మన్ రామ్ రెడ్డి, ఎంపీటీసీ రం అధ్యక్షులు సిద్ధిరాం పటేల్, బిచ్కుంద మండల్ సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు సాయిలు, సొసైటీ వైస్ చైర్మన్ యాదవ్, యువ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

బిచ్కుంద, మున్నూరుకాపు ఫంక్షన్ హాల్ లో కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ లో శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరలను జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ సిందే చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఆడపడుచులకు గౌరవించాలనే ఉద్దేశంతో పండగ ఉద్దేశాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టమని ఎమ్మెల్యే హనుమంత్ షిండే తెలిపారు.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి, షాదీ ముబారక్- కళ్యాణ లక్ష్మి 88 చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే హన్మంత్ షిండే అందజేశారు.ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ లబ్ధిదారులందరు తప్పకుండా కెసిఆర్ ను ఇంకోసారి ఆశీర్వదించాలని, కెసిఆర్ వల్లనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ఎంపీపీ అశోక్ పటేల్, జడ్పిటిసి భారతి రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్,బిచ్కుంద మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటరావు దేశాయ్, సొసైటీ చైర్మన్ నాల్చర్ బాలు,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బసవరాజ్ పటేల్, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు సిద్ధిరాంపటేల్, సొసైటీ వైస్ చైర్మన్ యాదవ్,వైస్ ఎంపీపీ రాజు పటేల్, పుల్కల్ సొసైటీ చైర్మన్ రామ్ రెడ్డి,సీనియర్ నాయకుడు భూమి శెట్టి, తాసిల్దార్ బి లక్ష్మణ్, ఆర్ ఐ సాయిబాబా, బిచ్కుంద మండల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు భారీఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News