సినీ నటుడు మోహన్‌బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు(TG HighCourt)లో భారీ ఊరట లభించింది. రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే ఇచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున విచారణకు సమయం కావాలని మోహన్ బాబు చేసిన విజ్ఞప్తితో న్యాయస్థానం ఏకీభవించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.
కాగా జర్నలిస్టులపై దాడి కేసులో పోలీసులు జారీ చేసిన నోటీసులను ఆయన తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున నోటీసులపై స్టే ఇవ్వాలని ఈ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. మోహన్ బాబు తరఫున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ పిటిషన్ దాఖలు చేశారు.