తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక సూత్రధారి అయిన ఎస్ఐబీ మాజీ చీప్ ప్రభాకర్‌రావు (Prabhakar Rao) ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. జూన్ 20 లోపు విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు.
- Advertisement -
ఈ కేసులో A-1గా ఉన్న ప్రభాకర్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమెరికా వెళ్లిపోయారు. న్యాయస్థానాల్లో ఆయనకు ఊరట కలగకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు.. జూన్ 20వ తేదీ లోపు ప్రభాకర్ రావు న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. లేనిపక్షంలో అఫెండర్‌గా ప్రకటిస్తామని హెచ్చరించింది.