Thursday, July 10, 2025
HomeతెలంగాణSwetcha Votarkar: స్వేచ్ఛ మృతికి అతడే కారణం.. తల్లిదండ్రులు ఫిర్యాదు

Swetcha Votarkar: స్వేచ్ఛ మృతికి అతడే కారణం.. తల్లిదండ్రులు ఫిర్యాదు

Swetcha Votarkar case update: ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య చేసుకోవడం జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. తమ కుమర్తె మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ స్వేచ్ఛ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్వేచ్చ వోటార్కర్ పలు టీవీ ఛానల్స్ లో న్యూస్ రీడర్ గా, డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌గానూ గుర్తింపు దక్కించుకున్నారు. ఐదేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకుంది. తన 13 ఏళ్ల కుమార్తెతో కలిసి అప్పటి నంచి పూర్ణ చంద్రరావు అనే వ్యక్తితో కలిసి ఉంటోంది. ఆమె ఫేస్ బుక్ పేజీ పేరును కూడా ఆమెకు 13 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయగా.. పూర్ణచంద్రరావు నిరాకరించాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో పూర్ణచందర్ తో కలిసి ఉండలేనంటూ తమకు చెప్పి బాధపపడేదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.

పూర్ణచందర్ మోసం చేయడంతోనే తీవ్రంగా మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. ఈమేరకు పేరెంట్స్ తో పాటు ఆమె కుమార్తె స్టేట్మెంట్ కూడా రికార్డు చేసుకున్నారు. స్వేచ్ఛ ఆత్మహత్య ఘటన జరిగిన నాటి నుంచి పూర్ణచంద్రరావు ఫోన్‌ స్విచ్ఛాప్‌ వస్తోంది. దీంతో పోలీసులు కూడా ఆమె మరణానికి పూర్ణచందర్ కారణమని అనుమానిస్తున్నారు. అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

ఎంతో యాక్టివ్ గా ఉండే స్వేచ్ఛ ఇలా ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంపై జర్నలిస్ట్ వర్గాలు, ఫ్రెండ్స్ నమ్మలేకపోతున్నారు. ఆమె మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ డైరెక్టర్ వేణు ఊడుగుల కూడా స్వేచ్ఛ మరణం తనకు వ్యక్తిగత లోటని వాపోయారు.

కాగా శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో జవహర్ నగర్ లోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె నేత్రాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. స్వేచ్ఛ తండ్రి శంకర్ ఉమ్మడి ఏపీలో పీడీఎసీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో స్వేచ్ఛ ఈసీ మెంబర్ గా ఎన్నికయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News