Saturday, October 12, 2024
HomeతెలంగాణBirpur: అట్టహాసంగా ఫ్రెషర్స్ డే సంబరాలు

Birpur: అట్టహాసంగా ఫ్రెషర్స్ డే సంబరాలు

సంబరంగా..

జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల కేంద్రంలో విద్యార్థులు సందడి చేశారు. స్థానిక  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్ డే వేడుకలు విద్యార్థుల నృత్యాలతో అట్టహాసంగా జరిగాయి. ఆటపాటలతో అలరించారు.

- Advertisement -

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల జిల్లా ప్రిన్సిపాల్ సంఘం అధ్యక్షులు రమేష్ బాబు , ప్రిన్సిపాల్స్ నాగభూషణం మరియు మల్లయ్య హాజరై విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఎంపిక చేసుకొని వాటిని సాధించడానికి నిరంతరం కృషి చేయాలని, అలాగే పోటి ప్రపంచంలో విద్య తో పాటు అన్ని రంగాల్లో రాణించినప్పుడే చదివిన చదువుకు సార్ధకత ఉంటుందన్నారు. బీర్ పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వి.రామకృష్ణ, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News