Saturday, October 12, 2024
HomeతెలంగాణBirpur: సీఎం రేవంత్ ఫోటోకి పాలాభిషేకం

Birpur: సీఎం రేవంత్ ఫోటోకి పాలాభిషేకం

జీవన్ రెడ్డికి సన్మానం..

జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు గల్ఫ్ ఎన్.ఆర్.ఐ పాలసీ ప్రకటించిన ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నాయకులు. ఎన్.ఆర్.ఐ పాలసీ కొరకు కృషి చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని సన్మానించారు గల్ఫ్ కార్మికులు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
తల్లిదండ్రులను భార్య పిల్లలను కుటుంబాన్ని వదిలి ఉపాధి నిమిత్తం వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు గత ప్రభుత్వం కనీసం ఒక్క రూపాయి కూడా సహాయం అందించలేదు. ఉత్తర తెలంగాణ ఉపాధి కొరకు గల్ఫ్ పై ఆధారపడడమే మనకు ఏకైక మార్గంగా కనపడుతుందని, గతంలో ముంబాయి వలసలు ఉండేవి ఇప్పుడు గల్ఫ్ ఏకైక ఉపాధి మార్గం ఎంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్లు అయితే మనకు స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగై ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగైతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో గల్ఫ్ కార్మికులు అందరు కూడా రాజకీయాలకతీతంగా బలోపేతం చేశారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడినట్లయితే కష్టాలు తీరుతాయి ఎన్.ఆర్.ఐ ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగ యువత ఆకాంక్షలు వారి బలిదానాలతోని రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు గడిచింది. గడిచిన 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ఆ రెండు పర్యాయాలు కూడా కార్మికుల సంక్షేమ కోసం ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం బాధాకరం నాకు ఉన్న అనుభవం నేను ఉత్తర తెలంగాణ ప్రాంత వాసిని కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత గల్ఫ్ లో ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఏ విధంగా ప్రభుత్వం తోడ్పడాలి ఆలోచనతో 2014 2019 కాలంలో శాసనసభ్యుడిగా కానీ శాసనమండలి సభ్యుడు కానీ గల్ఫ్ కార్మికుల సమస్యలను ప్రసంగించకుండా చర్చ చేపట్టడం జరగలేదు.

- Advertisement -


గల్ఫ్ కార్మికులు అక్కడ మానసికంగా ఎదకులోనై బల్వన్ లేదా అనారోగ్యాలతో మరణాలు సంభవిస్తే ఒక్క రూపాయి కూడా సహాయం చేయలే కేవలం శవపేటిక మాత్రమే వచ్చింది అని తెలియజేశారు.
గత 10 సంవత్సరాలలో వెయ్యి శవపేటికలు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వచ్చాయి మన ప్రాంతంలోనే వారానికి ఒక శవపేటిక వచ్చాయి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నిక ప్రణాళికలో పేర్కోవడం కానీ నిజామాబాద్ పార్లమెంట్ లో ఆశించిన ఫలితం పొందలేకపోయిన నాకు ఒక తృప్తి ఉంది ఆనాటి ఎన్నికల సమయంలో ఉత్తర తెలంగాణలో గల్ఫ్ కార్మికుల సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ద చూపిస్తుంది.

గల్ప్ లో చనిపోయిన కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేయడంతో పాటు కుటుంబానికి  ప్రభుత్వపరంగా అమలు చేయవలసిన పథకాలు వారి ఆరోగ్య సదుపాయాలు కానీ గృహ నిర్మాణ కార్యక్రమం కానీ అన్నింటిలో ప్రాధాన్యత కలిపిస్తామని ఎన్నికల సమయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  వివిధ ప్రచార ప్రసంగాలలో మాట్లాడారన్నారు.

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పేర్కొనడం జరిగిందో దానికి అనుగుణంగా 17 సెప్టెంబర్ నాడు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసి గల్ఫ్ లో ఏ పరిస్థితిలో  మరణించిన 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిచేలా విధంగా ప్రణాళిక ప్రభుత్వం రూపొందించబడిందన్నారు.

గురుకుల పాఠశాలలో  25 % సీట్లు అందించే విదంగా ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ గృహ నిర్మాణం సదుపాయం ఇతర  సంక్షేమ పథకాలలో సదుపాయం కల్పించడంతో పాటు గల్ఫ్ కార్మికులు స్వదేశానికి వస్తే ఉపాధి అవకాశాలు వంటి వాటిపై జీవన్ రెడ్డి మాట్లాడారు.

జగిత్యాల జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గంలో బీర్ పూర్ సారంగాపూర్ రాయికల్ జగిత్యాల పట్టణ రూరల్ అర్బన్ ఏ ప్రాంతాలలో అయిన 10% గల్ఫ్ వారు అధికంగా ఉన్నారనీ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు జీవన్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, కొల్వాయి సింగిల్ విండో చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు గల్ఫ్ కార్మికులు వివిధ హోదాలో ఉన్న నాయకులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News