బిఆర్ఎస్ నాయకుడు, మాజీ జెడ్పీటీసీ, ప్రస్తుత తంగళ్ళపల్లి ఎంపీటీసీ కోడి అంతయ్య హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ దళిత మోర్చ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు సిరిసిల్ల వంశీ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మంగళవారం రోజున అయోధ్య శ్రీ రాములవారి పూజిత అక్షింతల ఊరేగింపు కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకుడు మాజీ జెడ్పీటీసీ, తంగళ్ళపల్లి ప్రస్తుత ఎంపీటీసీ కోడి అంతయ్య బూట్లు వేసుకొని అయోధ్య శ్రీ రామ పూజిత అక్షింతలను తలపై ఎత్తుకొని ఊరేగింపు చేయడం హేయమైన చర్య అని అన్నారు. కోడి అంతయ్య అనే వ్యక్తి ప్రజా ప్రతినిధి అయి ఉండి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం విడ్డూరమని, అసలు అతను ప్రజా ప్రతినిదేనానని మండల ప్రజలు ఆలోచనలో ఉన్నారన్నారు. ఇప్పటికే కొన్ని హిందూ సంఘాలు కోడి అంతయ్యపై మండిపడుతున్నాయని, అలా చేయడం హిందూ మతాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. ఈ చర్యను వారు తీవ్రంగా ఖండిస్తూ.. అంతయ్య పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ బంధువులందరికీ బిఆర్ఎస్ నాయకుడు, ఎంపీటీసీ అయిన కోడి అంతయ్య బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిందువులకు క్షమాపణ చెప్పాలని యెడల అదే చెప్పులతో అంతయ్య కు సమాధానం చెప్పాల్సిన రోజు దగ్గర్లోనే ఉందని ఈ సందర్భంగా హెచ్చరించారు.