Amith sha visit: ఈ నెల 29న అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో ఆయన హైదరాబాద్ లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. అలాగే రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ వ్యూహాలపై చర్చించడం. అనంతరం నిజామాబాద్ లోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరవుతారు. అక్కడే స్థానిక పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం.. రైతుల చిరకాల స్వప్నమైనందున తానెంతో సంతోషంగా ఉన్నానని ఆయన ఇంతకుముందే చెప్పారు.
రాబోయే ఎన్నికలపై దృష్టి:
అమిత్ షా తెలంగాణకు రాబోతున్నారానే విషయ తెలియగానే పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. షా ముఖ్యంగా లోక్ సభ ఎన్నికలు లేదా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం కోసం వస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలు ఎల్లప్పుడూ తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఆయన ప్రసంగాలు, సమీక్షలు రాష్ట్రంలో బీజేపీ కార్యకలాపాలు, రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపుతాయి. ఆయన పర్యటనల ముఖ్య ఉద్దేశాలు సాధారణంగా.. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడం, కార్యకర్తలను ఉత్సాహ పరచడంతో పాటు అక్కడి ప్రభుత్వ విధానాలపై దృష్టి పెట్టి.. వాటిపై విమర్శలు చేస్తూ ఉంటారు. వాటితో పాటు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటివి చేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆయన రాక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా ప్రాధాన్యత సంతరించుకుంది.