Monday, July 14, 2025
HomeతెలంగాణBJP: రాజాసింగ్‌ రాజీనామాపై బీజేపీ కీలక ప్రకటన

BJP: రాజాసింగ్‌ రాజీనామాపై బీజేపీ కీలక ప్రకటన

Rajasingh: తెలంగాణ బీజేపీ నేత గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తెలంగాణాలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని యోచిస్తుంటే పార్టీ మాత్రం.. ద్రోహులను ప్రోత్సహిస్తుందని చెప్పారు. దీనిపై పార్టీ అధికారికంగా తీవ్ర స్థాయిలో స్పందించింది. ఇటీవల జరిగిన రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నికల సందర్భంగా రాజా సింగ్ ప్రవర్తన పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని బీజేపీ స్పష్టం చేసింది.

- Advertisement -

పార్టీ వెల్లడించిన సమాచారం ప్రకారం, తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజా సింగ్ నామినేషన్ దాఖలు చేసేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చినట్టు తెలిపింది. ఆయన అభ్యర్థన మేరకు నామినేషన్ పత్రాలు అందించామని, అయితే, పార్టీ నిబంధనల ప్రకారం 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల మద్దతుతో ఫారమ్ సమర్పించాల్సి ఉండగా, రాజా సింగ్ కేవలం ముగ్గురు సభ్యుల సంతకాలతోనే పత్రాలు సమర్పించారని పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల అధికారి శోభా కరండ్లాజే, ఆయనను మరొక సరైన నామినేషన్ ఫారం సమర్పించమని కోరినా, తగిన మద్దతుదారులు లేకపోవడంతో ఆయన అర్హత కోల్పోయారని వివరించింది.

పార్టీపై విమర్శల పట్ల బీజేపీ అసహనం

రాజా సింగ్ పార్టీని విమర్శించడం, అసత్య ప్రచారం చేయడాన్ని పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఆయన సొంతంగా రాజీనామా చేసినా దాన్ని పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లనున్నారని తెలిపింది. ఇది మొదటిసారి కాదని, గతంలోనూ క్రమశిక్షణ విషయంలో రాజా సింగ్ పలు వివాదాలకు లోనైనారని బీజేపీ గుర్తు చేసింది. అప్పట్లో సస్పెండ్ చేసినా, తర్వాత మళ్లీ పార్టీలోకి తీసుకున్నామని తెలిపింది. అయితే, ప్రధానమంత్రి లేదా జాతీయ అధ్యక్షులు రాష్ట్రంలో పర్యటించినా, ఆయన పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని, తనే కేంద్రమైనట్టు ప్రవర్తించడాన్ని తీవ్రంగా పరిగణించినట్టు పేర్కొంది. బీజేపీలో వ్యక్తులకు కంటే పార్టీ నిబంధనలు, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఉందని స్పష్టంగా తెలిపింది. పలుమార్లు హెచ్చరించినా రాజా సింగ్ వాటిని పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిణామం చోటు చేసుకుందని పార్టీ అధికారికంగా ప్రకటించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News