Saturday, November 15, 2025
HomeతెలంగాణBJP MP Raghunandan: కవిత సానుభూతి నాకు అవసరం లేదు.. బీజేపీ ఎంపీ!

BJP MP Raghunandan: కవిత సానుభూతి నాకు అవసరం లేదు.. బీజేపీ ఎంపీ!

BJP Mp React on Kavitha Comments.: కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు స్పందించారు. దుబ్బాకలో ఎవరి దయాదాక్షిణ్యాలతో గెలవలేదని అన్నారు. రఘునందన్‌ హరీష్‌రావు పెత్తనం వద్దనుకునే నన్ను గెలిపించారని తెలిపారు. కవిత మాటల వెనుక అనేక అంశాలు దాగి ఉన్నాయని అన్నారు

- Advertisement -

నేను గతంలోనే చెప్పాను: కవిత చెప్పినవన్నీ పాత విషయాలేనని అన్నారు. నేను గతంలోనే చెప్పానని తెలిపారు. కవిత మరోసారి కొత్త విషయాలు చెబుతారని ఆశిద్దామని అన్నారు. కవిత సానుభూతి నాకు అవసరం లేదు. కవిత మాటల వెనుక అనేక అంశాలు దాగి ఉన్నాయని అన్నారు

సామాజిక తెలంగాణ నినాదంపై: కవిత “సామాజిక తెలంగాణ” అనే కొత్త నినాదాన్ని అందుకున్నారని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. 2014లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం ముగ్గురు బీసీలకు మాత్రమే మంత్రివర్గంలో స్థానం కల్పించారని గుర్తుచేశారు. అప్పుడు బీసీల గురించి ఆమె తన తండ్రిని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.

అప్పుడే రాజీనామా చేసుంటే మహిళలు బ్రహ్మరథం పట్టేవారు: కవిత రాజీనామా వ్యాఖ్యలపై రఘునందన్ రావు స్పందిస్తూ… బీఆర్ఎస్ లో జరుగుతున్న అంతర్గత విభేదాలపై ఇదొక సూచన అని ఎంపీ రఘునందన్‌ రావు అభిప్రాయపడ్డారు. కవిత రాజీనామా నిర్ణయం వెనుక మరిన్ని రాజకీయ అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్, కేటీఆర్, కవిత రాజకీయంగా ప్రాధాన్యత కోల్పోయారని రఘునందన్ రావు అన్నారు. కవిత వంటి మహిళా నాయకురాలు గతంలోనే కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు తగిన ప్రాధాన్యత లభించనప్పుడు రాజీనామా చేసి ఉంటే ఆమెకు బ్రహ్మరథం పట్టేవారని ఆయన వ్యాఖ్యానించారు. కవిత రాజీనామా వ్యవహారాన్ని రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టీ అంతర్గత రాజకీయాలకు సంబంధించినదిగా పేర్కొన్నారు. రాజీనామా వ్యవహారం కవిత రాజకీయ భవిష్యత్తులో మలుపుగా అభిప్రాయపడ్డారు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ఎంపీ రఘునందన్‌ రావు జోస్యం చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad