Saturday, November 15, 2025
HomeతెలంగాణRamachan Rao comments on Congress: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటే.. సాక్ష్యాలన్నీ తారుమారయ్యాక సీబీఐకి

Ramachan Rao comments on Congress: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటే.. సాక్ష్యాలన్నీ తారుమారయ్యాక సీబీఐకి

BJP State President Comments on Congress: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లపై బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు తీవ్ర విమర్మలు చేశారు. కాళేశ్వరం నిర్మాణంలోని సాక్ష్యాలన్నీ తారుమారయ్యాక సీబీఐకీ ఇచ్చారని ఆరోపించారు. గత ప్రభుత్వ పెద్దలు అన్ని సర్దుకోవడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వమే సాయం చేసిందని అన్నారు. సీబీఐ దర్యాప్తుతో ఇప్పటికైనా అవినీతి బయటకొస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన మిగతా అవినీతి కేసులను సైతం సీబీఐకి అప్పగించాలని ఎన్ రాంచందర్‌ రావు డిమాండ్ చేశారు.

- Advertisement -

బీసీల పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ది లేదు …
బీసీ రిజర్వేషన్ల పేరుతో బీసీలకు కాంగ్రెస్‌ ద్రోహం చేస్తోందని రాంచందర్‌రావు మండిపడ్డారు. 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు ఇస్తే 32 శాతమే బీసీలకు దక్కుతుందని అన్నారు. బీసీలకు 46 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

Also read: https://teluguprabha.net/telangana-news/telangana-government-orders-cbi-probe-into-kaleshwaram-project-irregularities/

తెలంగాణ ఓటర్లను కాంగ్రెస్‌ అవమానించడమే..
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కలిసి యూరియా విషయంలో బీజేపీపై నిందలు వేస్తున్నాయని రాంచందర్‌రావు అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని… తెలిపారు. రెండు పార్టీలు ఒక్కటి కాకుంటే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. సీఎం, మాజీ సీఎం పరస్పర ఒప్పందంతోనే ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సీఎం కేసీఆర్‌ను తప్పించేందుకు చూస్తున్నారని అన్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించలేక… దృష్టి మరల్చే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు

తెలంగాణ ఓటర్లను కాంగ్రెస్‌ అవమానించడమే..
ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఓట్‌ చోరీ అంటూ దృష్టి కాలయాపన చేస్తున్నారని రాంచందర్‌రావు తెలిపారు. రాష్ట్రంలో ఓట్‌ చోరీ అయిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌ వ్యాఖ్యానించడం తెలంగాణ ఓటర్లను కాంగ్రెస్‌ అవమానించడమేనన్నారు. ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదని ఆరోపించారు.

ఎమ్మెల్యేలందరూ బీజేపీ వైపే…
రాష్ట్రంలో ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని ఎంపీ అర్వింద్‌ తెలిపారు. ఓట్‌ చోరీ విషయంలో 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిచినప్పుడు అనేక అనుమానాలు వచ్చాయని.. అప్పు డు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎందుకు మాట్లాడలేదో మహేష్‌ గౌడ్‌ చెప్పాలని అన్నారు. ఓట్లు, సీట్లు ఇచ్చిన నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి రాష్ట్ర బీజేపీ కమిటీలో పదవులు ఇవ్వాలని రాంచందర్‌రావును కోరారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad