Saturday, November 15, 2025
HomeతెలంగాణElections: కాంగ్రెస్‌కు షాక్‌.. చక్రం తిప్పిన బండి సంజయ్!

Elections: కాంగ్రెస్‌కు షాక్‌.. చక్రం తిప్పిన బండి సంజయ్!

Urban bank elections in Karimnagar: కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. ఎంపీ బండి సంజయ్ చక్రం తిప్పడంతో బీజేపీ తన సత్తా చాటింది. అధికార కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలుగా విడిపోవడంతో బీజేపీ గెలుపును కైవసం చేసుకుంది. బీజేపీ ఎక్కడా ఆర్భాటం చేయకపోయినప్పటికీ చాపకింద నీరులా ప్రచారం చేసి తన ప్యానల్‌ను గెలిపించుకుంది. పోటీ చేసిన మూడు ప్యానళ్లు నిన్నటి వరకు కాంగ్రెస్ అభ్యర్థులుగా ఉన్నవారే కావడం విశేషం. కొందరు కాంగ్రెస్ నాయకులు వెలిచాల ప్యానల్‌కు దూరంగా ఉండి రహస్యంగా మరో అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ క్యాడర్ గందరగోళానికి గురైంది.
ఎన్నికల తర్వాత విజేతలు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆశీస్సుల కోసం వెళ్లారు. బీజేపీ దీన్ని తమ గెలుపుగా ప్రచారం చేసుకోవడం కాంగ్రెస్‌కు గట్టి షాక్‌గా మారింది. ఈ ఫలితాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశం ఉంది.  బీజేపీ ఇదే వ్యూహాన్ని స్థానికఎన్నికల్లో సైతం అనుసరిస్తుందని చెప్పకనే చెప్పింది. జిల్లాలో ముడుముక్కలైన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారడంతో.. ఆ పార్టీ నాయకులు అధిష్టానం ముందు తలదించుకునే పరిస్థితి నెలకొన్నది.
బండి సంజయ్ విసిరిన పంజాకు కుందేలైన  కాంగ్రెస్ పార్టీ: కరీంనగర్ అర్బన్ బ్యాంకు పాలకవర్గానికి జరిగిన ఎన్నికల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ విసిరిన పంజాకు కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులను పెట్టడం లేదంటూ బీజేపీ పెద్దలు తెలిపారు. దీంతో పోటీ చేసిన మూడు ప్యానళ్లు కూడా నిన్నటి వరకు కాంగ్రెస్ అభ్యర్థులుగా కొనసాగినవారే కావడం విశేషం. ప్రచారంలో సైతం మేమే అసలైన కాంగ్రెస్ పార్టీ వారమంటూ ప్రచారం చేసుకున్నారు. చివరకు ఓటింగ్ జరిగి గెలుపు ఖాయం కావడంతోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆశీస్సుల కోసం వెళ్లడం బీజేపీ సైతం గెలుపును తమ ఖాతాలో వేసుకుని సోషల్ మీడియాలో అదరగొట్టే స్థాయిలో ప్రచారం నిర్వహించడం అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్‌గా తయారైంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad