Friday, November 22, 2024
HomeతెలంగాణKCR-Etela Rajender: బీజేపీ బెంగాల్ స్ట్రాటజీ.. కేసీఆర్‌పై ఈటల పోటీ?

KCR-Etela Rajender: బీజేపీ బెంగాల్ స్ట్రాటజీ.. కేసీఆర్‌పై ఈటల పోటీ?

- Advertisement -

KCR-Etela Rajender: ఒకప్పుడు రెండు స్థానాలతో ఉన్న బీజేపీ ఇప్పుడు దేశంలోనే తిరుగులేని శక్తిగా మారిన సంగతి తెలిసిందే. దీనికి ప్రధాన కారణం మోడీ-షా ద్వయం. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్ట్రాటజీతో.. జాతీయ స్థాయిలో ఒక్కో విధానంతో పార్టీని అంచెలంచెలుగా ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇందులో మంచి చెడు లెక్కల గురించి పక్కనపెడితే.. ఒక రాజకీయ పార్టీ చేయాల్సిన అన్నీ ఉపాయాలను ఉపయోగిస్తూ బీజేపీ ఒక్కో రాష్ట్రంలో జెండా పాతేయాలని చూస్తుంది.

మిగతా రాష్ట్రాల సంగతెలా ఉన్నా ఇప్పుడు తెలంగాణలో పుంజుకోవాలని కసి మీదున్న బీజేపీ కలిసొచ్చే ఏ అంశాన్ని వదులుకోకుండా అందిపుచ్చుకోవాలని చూస్తుంది. ఇప్పటికే ఎన్నికల ఊసే లేకపోయినా రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. ఈ నెలాఖరు నుండి ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే గులాబీ అధినేత కేసీఆర్ ఫీల్డ్ లో దిగేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతుండగా.. బీజేపీ కౌంటర్ అటాక్ కోసం సిద్దమవుతున్నట్లు కనిపిస్తుంది.

ఈసారి కేసీఆర్ పైనే తాను పోటీ చేస్తానని ఈటల రాజేందర్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, అదేదో ఆవేశంలో చెప్పిన మాటగానే తీసుకున్నారు అప్పుడు. కానీ ఇప్పుడు అదే నిజం కాబోతుందట. ఈటల రాజేందర్‌ నే కేసీఆర్‌ పై పోటీకి దింపాలని బీజేపీ హైకమాండ్ డిసైడయిందట. ఈ మధ్యనే ఢిల్లీలో ఈ అంశంపై దిశానిర్ధేశం చేసిన హైకమాండ్.. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో గజ్వేల్ లో ఈటల పని మొదలుపెట్టినట్లు రాజకీయ వర్గాల సమాచారం.

బీజేపీ బెంగాల్ లో కూడా ఇదే స్ట్రాటజీని ఉపయోగించింది. ఆమె నియోజకవర్గంలోనే దీదీని ఓడించి రాష్ట్రం మొత్తానికి ఒక సంకేతాన్నిచ్చారు. ఇక్కడ కూడా తాము అధికారంలోకి రాగలమని నమ్మించాలంటే ముందుగా కేసీఆర్ ఇలాఖాలోనే నెగ్గుకు రావాలి. బీజేపీ ఇప్పుడు అదే మొదలు పెడుతుంది. అయితే, ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందుకంటే అక్కడ ఉంది కేసీఆర్. అందునా ఈటలను కేసీఆర్ తో పోల్చి చూడడం ఖాయం. అందుకే అదంత సులభంగా తేలేది కాదు. కానీ, రాష్ట్ర రాజకీయాలలో కాక రేగడం మాత్రం ఖాయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News