ఫార్ములా ఈ-కార్ రేసు(Formula E-Race) కేసులో ఏసీబీ విచారణకు హెచ్ఎండీఏ(HMDA) మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి(BLN Reddy) హాజరయ్యారు. రేసు జరిగిన సమయంలో విదేశీ సంస్థకు హెచ్ఎండీఏ ఖాతా నుంచి నగదు బదిలీ చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. మొత్తం రూ.54 కోట్ల లావాదేవీలకు సంబంధించిన ప్రశ్నలను ఏసీబీ అధికారులు అడగనున్నారు. ఎవరి ఆదేశాలతో నిధులు చెల్లించారు.. నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందనే అంశాలపై ప్రశ్నించనున్నారు.
- Advertisement -
కాగా ఈ కేసులో బీఎల్ఎన్ రెడ్డి ఏ3గా ఉండగా…కేటీఆర్ ఏ1గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ2గా ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్‌లను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. కేటీఆర్‌ను గురువారం సుమారు 7 గంటల పాటు విచారించారు.