Sunday, April 27, 2025
Homeతెలంగాణబీఆర్‌ఎస్ సభకు వెళ్లే వాహనాలకు అడ్డంకులు చట్ట విరుద్ధం: నేతల ఆగ్రహం

బీఆర్‌ఎస్ సభకు వెళ్లే వాహనాలకు అడ్డంకులు చట్ట విరుద్ధం: నేతల ఆగ్రహం

వరంగల్‌లో జరుగనున్న బీఆర్‌ఎస్‌ సభలో పాల్గొనేందుకు వెళ్లే వాహనాలను నిలిపివేయడం చట్ట విరుద్ధమని.. ఆ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ మరియు జిల్లా అధ్యక్షుడు తాత మధు ఈ మేరకు స్పందించారు. ప్రైవేటు యాజమాన్యంలో నడుస్తున్న స్కూల్ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలను సభకు వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం సరికాదని వారు స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.

- Advertisement -

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో జరిగిన సభలను అడ్డుకున్నది తాముకాదని, అప్పుడు బీఆర్‌ఎస్‌లో ఉన్న, నేడు మంత్రి పదవులు, ఎమ్మెల్యే స్థానం సంపాదించిన వ్యక్తులే ఆ చర్యలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. మేము ఎప్పుడూ ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉన్నాం. ఇటువంటి చట్ట విరుద్ధ చర్యలు అధికార పార్టీకి మేలు చేయవు అని నేతలు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News