‘ఊరుగాని ఊరు’ అనే నవలను ఆవిష్కరించారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ రచయిత కోట్ల వనజాత రచించిన ఊరుగాని ఊరు నవల అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్టు అవార్డు పొందింది.
- Advertisement -
గ్రామాలలో నవీనతను ఆహ్వానిస్తూనే పునాదులను కాపాడుకోవాలని..గతంలో గ్రామాలలోని మనుషుల ద్వారా ఊరి ఐక్యత, సంస్కృతి, అలవాట్లు ప్రతిబింబించేదని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గుర్తుచేసుకున్నారు. మారిన పరిస్థితుల్లో పట్టణాలు పల్లెలలో తిష్టవేశాయని .. గ్రామీణ మనుషుల ఆలోచన, ఐక్యతను ధ్వంసం చేశాయని.. వ్యాపారాత్మక ధోరణులు గ్రామాల్లో విపరీతంగా పెరిగాయన్నారు.