Harish Rao fire on Congress: హైదరాబాద్‌లో వరద అంచనా వేయడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ అధికారులు హెచ్చరించిన ప్రభుత్వం అప్రమత్తంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి.. మీ బురద రాజకీయాలకు కాసేపు పక్కనపెట్టి వరదల్లో చిక్కుకున్న ప్రయాణీకులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని హరీష్ రావు హితవు పలికారు.
పండగ వేళ ర్లక్ష్య వైఖరి: ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే హైదరాబాద్ జల దిగ్బంధంలో చిక్కుకుందని హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే ఎంజీబీఎస్ లో ప్రయాణికులు వరద నీటిలో చిక్కుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. పండగ వేళ సొంతూళ్లకు వెళ్లలేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రయాణికులు భయం భయంగా రాత్రి నుండి పడిగాపులు కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారని తెలిపారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలని కోరారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/extremely-heavy-rains-in-telangana/
ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్: వరద ప్రవాహంపై మాజీ మంత్రి హరీష్‌రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. “రేవంత్ రెడ్డి గారు.. మీ బురద రాజకీయాలు కాసేపు పక్కన పెట్టీ వరదలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా తరలించండి. మూసీ పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఎప్పటికపుడు సమాచారం అందించండి. ప్రజలను అప్రమత్తం చేస్తూ.. ముంపు ప్రభావం ఉన్న వారిని తరలించి భరోసా కల్పించండి. తీవ్ర వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం” అంటూ హరీష్ రావు పోస్టు పెట్టారు. హైదరాబాద్‌లో వరద అంచనా వేయడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని.. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ అని హరీష్ రావు అన్నారు.


