Thursday, September 19, 2024
HomeతెలంగాణSuryapet: బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

Suryapet: బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

చల్లా శ్రీలతారెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపుమేరకు, హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అదేననుసారం నేరేడుచర్ల చౌరస్తానందు నేరేడుచర్ల పట్టణ/మండల కమిటీ అధ్యక్షులు చల్లా శ్రీలతారెడ్డి, అరబండి సురేష్ బాబు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతులను అవమానిస్తూ తెలంగాణ రైతాంగాన్ని హేళన చేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలు దహనం చేశారు, అనంతరం పలువురు మాట్లాడుతూ నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికి పైసలు పెట్టి పదవులు తెచ్చుకున్న రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతు సమస్యలు ఏం తెలుసని మండిపడ్డారు. రైతు రాజు కావాలని ధ్యేయం తోనే పని చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గొప్ప ఆలోచనలే రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, మిషన్ కాకతీయ రూపంలో అట్టడుగు స్థానంలో ఉన్న తెలంగాణని అభివృద్ధిలో నడిపించారని చెప్పారు. దేశానికే అన్నం పెడుతున్న తెలంగాణను మళ్లీ వెనక్కి లాగడానికి కాంగ్రెస్ దొంగలు వస్తున్నారని అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయ బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ నాదెండ్ల శ్రీధర్, డిసిసిబి చైర్మన్ దొండపాటి అప్పిరెడ్డి, గ్రంధాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ, మత్స్య శాఖ చైర్మన్ యామిని వీరయ్య, కౌన్సిలర్ తాళ్లూరి సాయి,కౌన్సిలర్ వేమూరి నాగవేణి నారాయణ, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వల్లం సెట్ల రమేష్ బాబు, ఆకారపు వెంకటేశ్వర్లు, ఇంజమూరి రాములు, ఇంజమూరి మల్లయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు/వైస్ చైర్మన్లు, సర్పంచులు, యూత్ అధ్యక్షులు కార్యదర్శులు, మహిళా సంఘ నాయకులు,రైతు సంఘం నాయకులు, రైతులు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News