Maganti Sunitha mass warning to Congress leaders: బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కాంగ్రెస్ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చింది. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని పేర్కొంది. ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి.. 14వ తేదీ తర్వాత చూసుకుందామంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఫలితాల తర్వాత చూసుకుందాం: బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన, బెదిరించిన ఊరుకునే ప్రసక్తే లేదని మాగంటి సునీత అన్నారు. పోలీసులు ఎవరికి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్‌గా ఉండి ఎన్నికలను సజావుగా జరిపించాలని కోరారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫసియుద్దీన్ దాడులకు పాల్పడుతున్నప్పటికీ పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఎంత ఇబ్బంది పేట్టినా.. ఈ నెల 13వ తేదీ వరకేనని అన్నారు. ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి.. 14వ తేదీ తర్వాత చూసుకుందామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయాలని మాగంటి సునీత విజ్ఞప్తి చేశారు.
నాన్‌లోకల్స్‌పై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు: జూబ్లీహిల్స్ పోలింగ్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి స్పందించారు. నియోజకవర్గంలో నాన్‌లోకల్స్ నేతల సంచారంపై కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్టుగా తెలిపారు. ఇప్పటివరకు నాన్‌లోకల్స్‌పై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్టుగా పేర్కొన్నారు. మొరాయించిన ఈవీఎంల స్థానంలో కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. ఇప్పటివరకు 9 చోట్ల ఈవీఎంలను మార్చినట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని అన్నారు.


