Wednesday, March 12, 2025
HomeతెలంగాణTG Assembly: అసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌

TG Assembly: అసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు(TG Assembly) ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ శర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్మయారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్(KCR) అసెంబ్లీకి వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు ఆయన ఘన స్వాగతం పలికారు. మరి గవర్నర్ ప్రసంగం వరకే ఉంటారా.. లేదంటే సమావేశాల మొత్తం సభకు హాజరవుతారా అనేది తేలాల్సి ఉంది.

- Advertisement -

గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై ఎజెండా ఖరారు చేసేందుకు బీఏసీ (BAC) సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సభను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై స్పష్టత రానుంది. మార్చి 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చించనున్నారు. మార్చి 19 లేదా 20న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News