Thursday, September 19, 2024
HomeతెలంగాణBRS: మెదక్ ఆర్టిస్ట్ డానియల్ కేసీఆర్ పెయింటింగ్

BRS: మెదక్ ఆర్టిస్ట్ డానియల్ కేసీఆర్ పెయింటింగ్

బిఆర్యస్ పార్టీ 23 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ సుప్రీం తెలంగాణా జాతిపిత, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని రూపొందించి పార్టీ ప్లీనరీ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వయంగా అందజేశారు మెదక్ ఆర్టిస్టు డానియల్. రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ద్వారా డానియల్ ఈ బహుమతిని అందజేయగలిగారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యా యాదవ్,సూర్యపేట జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగందర్ రావు,టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి,శాసన సభ్యులు గాధరి కిషోర్,కంచర్ల భూపాల్ రెడ్డి,చిరుమర్తి లింగయ్య, ఫైళ్ల శేఖర్ రెడ్డి, నోముల భగత్,యన్.భాస్కర్ రావు,బొల్లం మల్లయ్య యాదవ్,శానంపూడి సైదిరెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,డైరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్ కుమార్,ఉమ్మడి నల్లగొండ జిల్లా డి సి యం యస్ చైర్మన్ వట్టి జానయ్య యాదవ్, సూర్యపేట,నల్లగొండ జిల్లాల గ్రంధాలయ సంస్థ చైర్మన్ లు నిమ్మల శ్రీనివాస్ గౌడ్,రేగట్టి మల్లి కార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News