Jubilee Hills by Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతుంది. అన్ని పార్టీలు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత రాష్ట్రసమితి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం మరొకరితోనూ నామినేషన్ వేయించింది. పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డితో ఈ నామినేషన్ వేయించింది. ఇప్పటికే బీఆర్‌ఎస్ తరఫున మాగంటి సునీత 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అయితే.. నామినేషన్ తిరస్కరణకు గురైతే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా బీఆర్ఎస్ పార్టీ నేతలు విష్ణువర్ధన్‌రెడ్డితోనూ నామినేషన్ వేయించారు.
గోపీనాథ్ సేవలను గుర్తించిన కేసీఆర్: మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైంది. గోపీనాథ్ మూడుసార్లు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీకి గోపీనాథ్ చేసిన సేవలను గుర్తించిన కేసీఆర్.. ఆయన సతీమణి మాగంటి సునీతను అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంతో ఇప్పటికే మాగంటి సునీత బీఆర్‌ఎస్ తరఫున 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. దివంగత నేత కుటుంబానికి అండగా నిలవడంతో పాటుగా.. నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు ఉన్న బలమైన కేడర్ మరియు మాగంటి కుటుంబానికి ఉన్న సానుభూతిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగానే బీఆర్‌ఎస్ పార్టీ మాగంటి సునీతను రంగంలోకి దించింది. దీంతో ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపాలని బీఆర్‌ఎస్ పార్టీ పట్టుదలతో ఉంది. అయితే మాగంటి సునీత నామినేషన్ తిరస్కరణకు గురైతే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా బీఆర్ఎస్ పార్టీ నేతలు విష్ణువర్ధన్‌రెడ్డితోనూ నామినేషన్ వేయించారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్‌ను రంగంలోకి దిగారు. బీజేపీ తన అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డిని పోటీలో నిలిపింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్:
నామినేషన్ల స్వీకరణ ప్రారంభం : ఈ నెల 13
నామినేషన్ల దాఖలు చివరి రోజు : ఈ నెల 21
నామినేషన్ల పరిశీలన : ఈ నెల 22
నామినేషన్ల ఉపసంహరణ : ఈ నెల 24
పోలింగ్ : వచ్చేనెల 11
కౌంటింగ్ : వచ్చేనెల 14


