వ్యవసాయాన్ని జాతీయ గ్రామీణ ఉపాధి హమీ ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ పోస్టు కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించిన నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డిని అభినందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. గతంలో రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తీర్మానం మేరకు కేంద్రంపై ఒత్తిడి పెంచేలా కార్యాచరణకు పెద్ది సుదర్శన్ రెడ్డి పూనుకోవడాన్ని స్వాగతిస్తున్నానని కేటీఆర్ అన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొంటున్న నర్సంపేట నియోజకవర్గ రైతులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానించే చర్యలను ప్రారంభించాలని ఆయన కోరారు.