Saturday, April 19, 2025
HomeతెలంగాణBRS: గ్యాస్ ధర తగ్గించు లేదా నిన్ను గద్దె దించుతాం

BRS: గ్యాస్ ధర తగ్గించు లేదా నిన్ను గద్దె దించుతాం

కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిజాం పేట మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీ ల పరిధిలో భారీ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఈ నిరనస కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ధరలు తగ్గించకపోతే ప్రధాని మోడీని మహిళలే గద్దె దించే రోజులు ఎంతో దూరం లో లేవని శంభీపూర్ హెచ్చరించారు. ధర్నా, రాస్తారోకోల్లో భారీగా స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు కూడా పాల్గొన్నారు.

- Advertisement -

నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News