తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎంఆర్ఎఫ్ (సీఎం సహాయనిధి) పథకం పేదల ఆరోగ్యానికి భరోస అందిస్తుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమాల్ నివాసంలో పెద్దేముల్ మండలనికి చెందిన రాజేశ్వర్ రావు S/o శ్రీనివాస్ వారీ కుటుంబ సభ్యులకు రూ. 60,000 /- , తాండూర్ మండలం సిరిగిరి పెట్ గ్రామానికి చెందిన జగదీశ్వర్ కి 36,000/-, తాండూర్ టౌన్ పుడురు గల్లి, ఓల్డ్ తాండూర్ కి చెందిన శివ కుమార్ కి 23,500 /- వేలు మంజూరు కావడంతో బాధితులకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయూతనందిస్తుందన్నారు. పేదలకు ఈ పథకం వరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్, కౌన్సిలర్ మన్న పురం రాము , బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావూఫ్, పట్లోళ్ళ నర్సింహులు, పట్లోళ్ళ బాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సయ్యద్ జుబైర్ లలా, రాష్ట్ర యూత్ కార్యదర్శి బి.రఘు, తాండ్ర రాకేష్, సిద్దు అయ్యా , అగ్గనూర్ సంకేత్, రాజ్ శేకర్, అదం ఖాన్ పాల్గొన్నారు.