దేశ ప్రజలంతా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని దేశంలోనే
ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖని పట్టణంలోని తిలక్ నగర్ విశ్వం కమ్యూనిటీ హాల్ లో రామగుండం కార్పోరేషన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టికి చెందిన మహిళలు గౌసియా శమీమ్ సాలెహ అప్రీన్ మహ్మదా మైనునా రహమాత్ బిల్కిస్ నైమా జాకీయా సుజాతా మానస ఆఫ్సారి సపియా రిజవాన భద్రునా ఆకెనపల్లి గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్తులు సంఘ నాయకులు అయులవేని సంతోష్ రాయుళ్ల సాగర్ జిట్టవెన లక్ష్మన్ ఉత్తెం పోశయ్య ఎంఐఎం కార్పోరేషన్ అధ్యక్షుడు హజ్ ఆలీ దినబంధు స్వంచ్చంద సంఘ బాధ్యుడు పాషా ఎన్టీపీసీ మజీద్ కమిటి మత పెద్ద సైపుల్లఖాన్ తో పాటు 500 మంది బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే సమక్షంలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదవాడి సంక్షేమంపై సీఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టిసారించి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసి పేద వారికి అండగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆకలిచావులు ఆత్మ హత్యలు లేకుండా పేద కుటుంబాలకు ఆసరా పింఛన్ లో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇలాంటి పథకాలను అమలు చేస్తూ వారికి కొండంత అండగా నిలుస్తారని అన్నారు.
60 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ
ఎనాడు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని కాంగ్రెస్ పార్టీ కారణంగానే ప్రజలకు కష్టాలు వచ్చాయని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో సకల వర్గాల సంక్షేమం కోసం తాము కృషి చేస్తున్నామన్నారు.
తొమ్మిదేళ్ల కెసిఆర్ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని సకల వర్గాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ రుణం ఓటు వేసి తీర్చుకోవాలని మూడవసారి హ్యాట్రిక్ సీఎంగా కెసిఆర్ ను తిరిగి ఎన్నుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మాపై అసత్య అరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కుట్రలను తిప్పికోట్టాలన్నారు. రాబోవు ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచి ఎమ్మెల్యే గా గెలుచాలన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్గాం జడ్పీటీసి అముల నారాయణ కార్పొరేటర్ ఇంజపురి పులిందర్, కో ఆప్షన్ సభ్యులు రఫిక్, సర్పంచ్ లు ధరని రాజేష్, మెరుగు పోశం ఎంపిటిసి మస్కం శ్రీనివాస్, మండల కో ఆప్షన్ సభ్యులు గౌస్ పాషా, టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధులు, పట్టణ మండల అధ్యక్షులు, నాయకులు శంకర్, తిరుపతి నాయక్, మారుతీ, జె.వి రాజు, సిరాజుద్దీన్, హఫీజ్, మీర్ ఫయాజ్ అలీ, మెండె రమేష్, ఆర్శనపల్లి శ్రీనివాస్ , రామన్న అతరోద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
Korukanti Chander: తిరుగులేని రాజకీయ శక్తి BRS
కాంగ్రెస్, బిజెపి, ఎంఐఎం పార్టీల నుండి 500 మంది బిఅర్ఎస్ లో చేరిక