Wednesday, April 2, 2025
HomeతెలంగాణBRS: ఈడీ పరిధిని అతిక్రమిస్తోంది

BRS: ఈడీ పరిధిని అతిక్రమిస్తోంది

కేంద్రప్రభుత్వ అధీనంలోని ఈడీ తనకున్న పరిధులను అతిక్రమించి ప్రవర్తిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. బిఆర్ యస్ కు చెందిన కవితను విచారణ పేరుతో నిబంధనలు ఉల్లంఘించడమే ఇందుకు నిదర్శనమన్నారు. సూర్యపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియా తో మాట్లాడుతూ ..కనీసం మహిళ అన్న విజ్ఞత మరచిపోయిన ఈడీ అధికారులు విచారణ పేరుతో అర్ధరాత్రి వరకూ సతాయించడం ఏంటంటూ ఆయన కేంద్రప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

- Advertisement -

రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడంలో మోడీ సర్కార్ దిట్ట అని మరోమారు రుజువు చేస్తోందన్నారు. కవిత పై ఈడీ అధికారులు మోపిన అభియోగం ముమ్మాటికీ రాజకీయ కక్ష్యతోనేనని ఆయన ఆరోపించారు. అటువంటి బిజెపికి ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం చెబుతారని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News