నవీన భారత ఆవిష్కరణ లక్ష్యంగా సాగుతున్న బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ శక్తులు, ప్రగతికాముక శక్తులు, మేధావులు కలిసి వస్తున్నారు. హైదరాబాద్ లో బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రలోని నాగ్ పూర్, ఔరంగాబాద్ ప్రాంతాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఔరంగాబాద్ జిల్లా మాజీ జెడ్పీ ఛైర్మన్ వినోద్ తంబె, వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ నుండి యవత్మాల్ లోక్ సభ స్థానానికి పోటీ చేసిన ప్రవీణ్ పవార్ లు బిఆర్ఎస్ పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వీరితో పాటు షుగర్ ఫ్యాక్టరీ మాజీ డైరెక్టర్ దతాత్రే కాంబ్లే, చావా సంఘత్నా మాజీ అధ్యక్షుడు విఠల్ దేశ్‌ముఖ్, నితిన్ భోంస్లే, జీవన్ భోంస్లే, గజానన్ చవాన్, శంకర్ గలేవాడ్, ఔరంగాబాద్ ప్రాంతానికి చెందిన ఔరగ్‌బాద్ టౌన్ కార్పొరేటర్లు అఫ్జర్ అస్తర్ షేక్, సుభాస్ ఫజీరావ్. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఔరంగాబాద్ శాఖ సెక్రటరీ ఖాజా ఎక్బర్ షేక్, కాంగ్రెస్ పార్టీ తాలూకా అధ్యక్షుడు వినోద్ పాటిల్ తంబే, కాంగ్రెస్ పార్టీ ఔరంగాబాద్ ఉపాధ్యక్షుడు బాలాసాహెబ్ పాటిల్, మాజీ నగర సేవక్ జమీల్ ఖాన్, ధన్గర్ సమాజ్ అధ్యక్షుడు బందు పార్ఖే తదితర దాదాపు 30 మంది నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, హిమాన్షు తివారి తదితరులు పాల్గొన్నారు.