Wednesday, June 4, 2025
HomeతెలంగాణHarish Rao: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. హరీశ్ రావు సవాల్

Harish Rao: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. హరీశ్ రావు సవాల్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) సవాల్ విసిరారు. రాష్ట్ర మహిళలకు రూ.21వేల కోట్ల వడ్డీ లేని రుణాలను ఇచ్చినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కొందరు మాట్లాడుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని తేల్చిచెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే వంద సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారులు గులాబీ కార్యకర్తలను వేధిస్తే రెడ్ బుక్‌లో పేర్లు రాసుకుంటామని హెచ్చరించారు. తమ ప్రభుత్వం వచ్చాక వారికి బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.

- Advertisement -

‘‘రేవంత్‌ రెడ్డి ఒక్క ప్రాజెక్టు కట్టారా? ఒక్క చెరువు తవ్వారా? అని ప్రశ్నించారు. రైతుబంధు, రైతుబీమా ఎగ్గొట్టారు.. పూర్తి రుణమాఫీ చేయలేదని విమర్శించారు. సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా ఏపీ ప్రభుత్వం నిర్మించదలుచుకున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని చెప్పారు. బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్‌ను అడ్డుకోవాలని అన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు పోలీస్ కమాండ్ కంట్రోల్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్షలు చేస్తున్నారా? అని హరీశ్ రావు విమర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News