Harish Rao challenge Revanth Reddy: నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల ముందు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ వాడుకుందని తెలిపారు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగలను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. శుక్రవారం నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో ‘కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు’ ఆవిష్కరణ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొని.. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
దమ్ముంటే అశోక్‌నగర్ రా..!: కేసీఆర్ సర్కార్ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్‌లకు.. నియామకపత్రాలు ఇవ్వడం ఉద్యోగాలు ఇచ్చినట్టుకాదని హరీశ్‌రావు అన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే బట్టలూడదీసి కొడతారని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డీ.. నీకు దమ్ముంటే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై చర్చించేందుకు పోలీసు భద్రత లేకుండా అశోక్‌నగర్‌లోని చిక్కడపల్లి లైబ్రరీకి రాగలవా..అని హరీశ్‌రావు సవాల్ విసిరారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలేదు కానీ.. రెండు నెలల ముందే మద్యం నోటిఫికేషన్లు ఇచ్చారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. జాబ్‌లు నింపాలని అడిగితే.. రేవంత్ రెడ్డి జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు.
రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడా..: జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ లెస్ కేలండర్ విడుదల చేశారని హరీశ్‌రావు అన్నారు. ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా.. అని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్ రావు ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ బోగస్ అయిందని తెలిపారు. రాజీవ్ యువ వికాసం వికసించకముందే వాడిపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు సురుకు పుట్టాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు నిరుద్యోగులు దండు కట్టాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. విద్య, మున్సిపల్, హోంశాఖల మంత్రిగా, సీఎం రేవంత్‌రెడ్డి ఫెయిల్ అయ్యారని అన్నారు. వసూళ్ల మంత్రిగా మాత్రం సీఎం పాస్ అయ్యారని హరీశ్ రావు విమర్శించారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/today-telangana-cm-revanth-reddy-visit-delhi/
ఈరోజు నుంచి నీకు చుక్కలు చూపిస్తాం: నోటిఫికేషన్లు ఇచ్చింది, పరీక్ష పెట్టింది, ఫిజికల్ టెస్టు పెట్టింది.. బీఆర్‌ఎస్ ప్రభుత్వమని బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి అన్నారు. కేవలం నియామకపత్రాలు ఇచ్చింది మాత్రం రేవంత్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని అన్నారు. లేకుంటే.. ఈరోజు నుంచి రేవంత్ రెడ్డికి చుక్కలు చూపిస్తామని రాకేశ్‌రెడ్డి హెచ్చరించారు.


