తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) వినూత్న నిరసన చేపట్టారు. కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) సహా ఎమ్మెల్యేలంతా నల్ల చొక్కాలు, చేతులకు బేడీలు ధరించి అసెంబ్లీకి వచ్చారు.
- Advertisement -
‘ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. లాఠీ రాజ్యం లూటీ రాజ్యం.. రైతులకు బేడీల సిగ్గు సిగ్గు..’ అంటూ నినాదాలు చేస్తూ అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. కాగా అసెంబ్లీలో లగచర్ల, దిలావర్ పూర్, రామన్న పేట సహా పలు ఘటనలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.