Wednesday, February 5, 2025
HomeతెలంగాణMLAs: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీ.. ఏం జరగనుంది?

MLAs: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీ.. ఏం జరగనుంది?

సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు కాంగ్రెస్(Congress) పార్టీలో చేరిన బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, సంజయ్ కుమార్, ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరితో పాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా భేటీలో పాల్గొన్నారు. నోటీసులపై ఎలా స్పందించాలనే అంశంపై వీరు ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ అంశంపై ముందుకెళ్లాలనే దానిపైనా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన విజయం సాధించిన ఎమ్మెల్యేలలో 10 మంది కాంగ్రెస్‌లో చేరిన విషయం విధితమే. ఆ 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. అలాగే మాజీ మంత్రి కేటీఆర్ కూడా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లు కలిపి ఫిబ్రవరి 10న విచారణ చేస్తామని న్యాయస్థానం తెలిపింది. దీంతో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News