రైతు భరోసా(Rythu Bharosa) అమలుపై శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వ్యవసాయ సాగు భూములు ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు ఏడాదికి రూ.12,000 సాయం అందిస్తామని ఆయన ప్రకటించారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతూ ‘ఎగ్గొట్టిన రైతు భరోసా ఎప్పుడు వేస్తావ్ రేవంత్’ అంటూ హైదరాబాద్‌లో పోస్టర్లు అంటించారు.
‘2023 యాసంగిలో ఎకరానికి రూ.2,500లు, 2024 వానకాలంలో ఎకరానికి 7,500లు, యాసంగిలో ఎకరానికి రూ.7,500.. మొత్తం రూ.17,500 రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఎకరానికి బాకీ పడింది. మరో పోస్టర్‌లో రేవంత్.. రైతు భరోసా కింద అన్నదాతలకు ఒక్కో ఎకరానికి ప్రభుత్వం బాకీ పడింది. ఒక ఎకరానికి 17,500, రెండు ఎకరాలకు రూ.35,000, మూడు ఎకరాలకు రూ.52,500, నాలుగు ఎకరాలకు రూ.70,000, ఐదు ఎకరాలకు రూ.87,500, ఆరు ఎకరాలకు రూ.1,05,000, ఏడు ఎకరాలకు రూ.1,22,500 ఇవ్వాలి’ అంటూ తెలిపింది.