Saturday, April 26, 2025
HomeతెలంగాణBRS: బీఆర్ఎస్ రజతోత్సవం పాట విడుదల

BRS: బీఆర్ఎస్ రజతోత్సవం పాట విడుదల

ఉద్యమం పార్టీగా ప్రస్థానం మొదలుపెట్టి.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దం పాటు అధికారం చేపట్టిన బీఆర్ఎస్(BRS) పార్టీ 25వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో రజతోతవ్సం ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా సభకు తరలివస్తారనే అంచనా మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

- Advertisement -

అధికారం కోల్పోవడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవకపోవడంతో డీలా పడిన క్యాడర్‌ను ఉత్తేజపరిచేలా ఈ సభ నుంచి గులాబీ బాస్ కేసీఆర్(KCR) దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా రజతోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రూపొందించిన పాటను విడుదల చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News