బీఆర్ఎస్ పార్టీ నవంబర్ 29న రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్ (Deeksha Diwas)ను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. కరీంనగర్లో జరిగే దీక్షా దివస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టడం బీఆర్ఎస్ పార్టీ ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 29, 2009న కేసీఆర్ ప్రారంభించిన కీలకమైన నిరవధిక నిరాహార దీక్షకు ప్రతీకగా దీక్షా దివస్ (Deeksha Diwas) చేపట్టింది. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.