సింగరేణి బొగ్గు గనుల ను ప్రైవేటు పరం చేయకుండా సింగరేణి సంస్థకే కేటాయించాలని కార్మిక సంఘాలు ఇచ్చిన రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం లో బీ ఆర్ ఎస్ కార్మిక విభాగం, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.
- Advertisement -
రాజ్ భవన్ ముందు నిరసనకు దిగిన బీ ఆర్ టీ యూ నేత రాం బాబు యాదవ్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు కాపు కృష్ణ తదితరులను పోలీసులు అరెస్టు చేసి ఎస్ ఆర్ నగర్ స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్టులను బీ ఆర్ టీ యూ, టీజీబీకేఎస్ నేతలు ఖండించారు.