BRS party Win In workers union elections: హైదరాబాద్- బాలానగర్‌లోని ఎమ్ టీఏఆర్ (MTAR) టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. శనివారం నిర్వహించిన ఈ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గెలుపొందారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుని ఓడించి భారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షులుగా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు.
ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తా: తనపై నమ్మకం పెట్టుకొని గెలిపించిన కార్మికులందరికీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీలో కార్మికులకు ఉన్న ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తానని అన్నారు. ఎమ్ టీఏఆర్ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి 359 మంది కార్మికులను పర్మనెంట్ చేసిన అంశాన్ని గుర్తుచేశారు. కార్మికులకు క్యాంటీన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా కార్మికులకు బేసిక్‌ను 30% నుంచి 50% కు పెంచడం జరిగిందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్ టీఏఆర్ కంపెనీ బీఆర్టీయూ యూనియన్ జనరల్ సెక్రటరీ మాయ రాజయ్య, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ సత్యప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ లు వెంకటేశ్వర రెడ్డి, సమ్మయ్య, రాయుడు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


