KTR tweet on CM Revanth reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. గత రెండేళ్లలో పేదల ఇళ్లపైకి బుల్డోజర్‌లు పంపడం తప్పా .. రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని అన్నారు. పెద్దల ఇళ్లకు మాత్రం రేవంత్ సర్కార్ చుట్టంలా మారిందని అన్నారు. ఇండ్లు కూల్చేయడమే ఇందిరమ్మ రాజ్యమా.. ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు.
15 నెలల్లో 612 చోట్ల పేదల ఇండ్లు నేలమట్టం: పేదల ఇళ్లపై బుల్డోజర్ నడుపుతూ.. అక్రమ నిర్మాణాల విషయంలో బడా బాబులకు మాత్రం నెలల తరబడి గడువు ఇస్తున్న రేవంత్ రెడ్డి రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సామాన్యులపై కర్కశ చర్యలు.. అధికార వర్గాలపై సహన వైఖరి ప్రదర్శించడమే ఇందిరమ్మ రాజ్యం విధానాలా అని ప్రశ్నించారు. గత 15 నెలల్లో 612 చోట్ల పేదల ఇండ్లను నేలమట్టం చేయడం దారుణమని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ప్రభుత్వ పెద్దల అక్రమ నిర్మాణాలపై మాత్రం చర్యలు తీసుకోకపోవడం ఇదేనా అన్నారు. ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు.
ఇండ్లు కూల్చేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడమే ప్రజాపాలననా అని అన్నారు. గరీబోంకొ హటావో అనేదే కాంగ్రెస్ సిద్ధాంతమా..? అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాదులో కాంగ్రెస్ సర్కారు చేస్తున్న విధ్వంసం, అవినీతి, అక్రమాలపై చర్చించేందుకు హైడ్రా పేరిట నేడు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ వేదికగా సమావేశం నిర్వహించనున్నట్లు కేటీఆర్ తన ట్వీట్‌లో తెలిపారు. ఈ సమావేశంలో ప్రజల గోసను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
పేదలపైకి చట్టవిరుద్ధంగా బుల్డోజర్
పెద్దలకు మాత్రం చుట్టంలా మారిన రేవంత్ సర్కార్!సామాన్యుల ఇండ్లైతే నిరాక్షిణ్యంగా కూల్చివేతలు.
బడా బాబులకు మాత్రం నెలల తరబడి గడువులతో నోటీసులు.ఇదీ.. రేవంత్ రాక్షస పాలనలో ప్రజల గోస పుచ్చుకుంటున్న హైడ్రా తీరు.
15 నెలల్లో 612 చోట్ల సామాన్యుల… pic.twitter.com/9hizrS41bR
— KTR (@KTRBRS) November 2, 2025


