TGSPC| తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGSPC) చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం(Burra Venkatesham నియమితులయ్యారు. ఆయన నియామకానికి సంబంధించిన ఫైలుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుత చైర్మన్ మాజీ ఐపీఎస్ అధికారి ఎం.మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో పూర్తి కానుంది.
- Advertisement -
దీంతో కొత్త చైర్మన్ నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 20 వరకు 45 దరఖాస్తులు వచ్చాయి. రిటైర్డ్ ఐఏఎస్‌లు, వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు సైతం ఈ పోస్టు కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. దరఖాస్తు చేసుకున్న వారిలో బుర్రా వెంకటేశం పేరును సీఎం రేవంత్ రెడ్డి ఎంపిక చేశారు. అనంతరం గవర్నర్ ఆమోదం కోసం ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపించారు.