Tuesday, June 24, 2025
HomeతెలంగాణHyderabad: హైదరాబాద్‌లో దారుణం.. పసికందును చంపిన కసాయి తండ్రి

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. పసికందును చంపిన కసాయి తండ్రి

హైదరాబాద్(Hyderabad)లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుడే పుట్టిన పసికందును కన్నతండ్రే అత్యంత కిరాతకంగా హతమార్చిన విషాదకర సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నేపాల్‌కు చెందిన జగత్ అనే వ్యక్తి కొంతకాలంగా ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. రెండు వారాల క్రితమే అతడికి అమ్మాయి పుట్టింది. ఏమైందో ఏమో కానీ జగత్ తన కుమార్తెను చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని టోలీచౌకిలోని చెత్తకుప్ప సమీపంలో పడేశాడు. నిందితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జగత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే భార్యపై అనుమానంతోనే పాపను చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News