Sunday, July 7, 2024
HomeతెలంగాణCM KCR: క్యాబినెట్ విస్తరణ.. ముగ్గురు మంత్రులకు ఊస్టింగ్.. నలుగురికి చోటు?

CM KCR: క్యాబినెట్ విస్తరణ.. ముగ్గురు మంత్రులకు ఊస్టింగ్.. నలుగురికి చోటు?

- Advertisement -

CM KCR: తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరగనుందా? సీఎం కేసీఆర్ మరోసారి తెలంగాణ క్యాబినెట్ లో మార్పులకు శ్రీకారం చుట్టనున్నారా? అంటే రాజకీయ వర్గాల నుండి అవుననే సమాధానం వస్తుంది. సరిగ్గా ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేకపోయినా మంత్రివర్గంలో విస్తరణ మాత్రం చేపట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. దీంతో ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకొనేదెవరు? ఉన్న వారిలో పదవులు ఊడేది ఎవరివి? అని తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికరంగా చర్చ సాగుతుంది.

అయితే, ఇప్పటివరకు రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చ ప్రకారం కొత్తగా మరో నలుగురికి మంత్రి పదవులు దక్కబోతున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే ఈటల రాజేందర్ ఆరోగ్యశాఖ ఖాళీగా ఉంది. అప్పుడు ఆయనను తప్పించిన తర్వాత ఆ శాఖ బాధ్యతలను కూడా మంత్రి హరీష్ రావు చూసుకుంటున్నారు. కాగా, ఇప్పుడు క్యాబినెట్ విస్తరణలో అది ఓ బీసీ నేతకు అప్పగించనున్నట్లు వినిపిస్తుంది.

ఈసారి విస్తరణలో కనీసం ఇద్దరు బీసీ, ఇద్దరు ఎస్సీలకు అవకాశం కల్పించాలని చూస్తున్న కేసీఆర్ ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ముగ్గురిని పదవి నుండి తప్పించనున్నట్లు చర్చ జరుగుతుంది. ప్రస్తుతం కార్మిక మంత్రిగా ఉన్న మల్లారెడ్డి వివాదాస్పద మంత్రిగా పేరుతెచ్చుకున్నారు. దీనిపై అస్ఫతృప్తిలో ఉన్న కేసీఆర్ ఆయన్ను తప్పించనున్నట్లు తెలుస్తుంది. ఓ కీలకమైన సంక్షేమ పథకం అమలుపై కూడా అసంతృప్తిగా ఉన్న కేసీఆర్ ఆ మంత్రిపై కూడా వేటు వేయనున్నారట.

ఇక, కొత్తగా మంత్రివర్గంలో చేరేవారిలో సీనియర్ నేతలు కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనాచారితో పాటు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, బండా ప్రకాష్ ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఇద్దరు లేదా ముగ్గురికి మంత్రి అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. వచ్చే సంక్రాంతి తర్వాత ఈ క్యాబినెట్ విస్తరణ ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుండగా.. అదే సమయంలోనే సచివాలయం ప్రారంభ ముహూర్తం కూడా ఫిక్సయినట్లు తెలుస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News