Cabinet meeting on october 16th: పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చని హైకోర్టు ఆర్డర్ కాపీ విడుదల చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ స్థానిక ఎన్నికల అంశం రాష్ట్రంలో అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై ఈ నెల 16న రేవంత్ సర్కార్ కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. దీంతో అక్టోబర్ 16న జరిగే మంత్రివర్గ సమావేశంపై ఆసక్తి నెలకొంది.
హైకోర్టు తీర్పుపై ప్రధాన చర్చ: 42 శాతం బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న హైకోర్టు.. 50 శాతానికి రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఆర్డర్ కాపీలో స్పష్టంగా పేర్కొంది. 42 శాతంలో బీసీలకు కేవలం 25 శాతం రిజర్వేషన్లను మాత్రమే కేటాయించి.. మిగతా 17 శాతాన్ని జనరల్ కేటగిరీకి ఇవ్వాలని సూచించింది. అయితే ఇంతవరకూ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. దీంతో హైకోర్టు ఆదేశాలపై రేవంత్ ప్రభుత్వం తదుపరి నిర్ణయం ఏంటన్న దానిపై రాష్ట్ర సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇదే అంశంపై.. ఈనెల 16వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది.
ఎన్నికల సంఘం విజ్ఞప్తి: అక్టోబర్ 16న జరిగే సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు.. హైకోర్టు తీర్పుపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్రప్రభుత్వం స్పష్టతనివ్వాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా హైకోర్టు జారీ చేసిన ఆర్డర్ కాపీపై ఎన్నికల సంఘం న్యాయనిపుణులతో చర్చిస్తోంది. అంతే కాకుండా ఈ అంశంపై సర్కార్.. సుప్రీంకోర్టుకు వెళ్తుందన్న ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి.


