Sunday, November 16, 2025
HomeతెలంగాణTelangana Budget: ముగిసిన కేబినెట్ భేటీ.. బడ్జెట్‌కు ఆమోదం

Telangana Budget: ముగిసిన కేబినెట్ భేటీ.. బడ్జెట్‌కు ఆమోదం

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన కేబినెట్ సమావేశం(Cabinet Meeting) ముగిసింది. ఆర్ధిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) బడ్జెట్‌ను మంత్రివర్గంలో ప్రతిపాదించారు. అనంతరం బడ్జెట్‌(Telangana Budget)కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో కాసేపట్లో అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో విపక్షాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.

- Advertisement -

గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.90 లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టగా.. ఈసారి రూ.3 లక్షల కోట్లు దాటే అవకాశముందని సమాచారం. ఇందుకోసం ఇప్పటికే పలు శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో భట్టి చర్చలు జరిపారు. ఏ శాఖకు ఎంత కేటాయించాలనే దానిపై స్పష్టతకు వచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు పెద్దఎత్తున ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశముంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad