Sunday, April 6, 2025
HomeతెలంగాణCapt. Lakshmikantha Rao: హుజురాబాద్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం

Capt. Lakshmikantha Rao: హుజురాబాద్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం

కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ వెంటే

హుజురాబాద్ నియోజకవర్గంలో బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారని మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు అన్నారు. హుజురాబాద్ బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ మండలం సింగాపురంలో మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కెప్టెన్ మాట్లాడుతూ.. హుజురాబాద్ మండలంలోని బీ ఆర్ ఎస్ కార్యకర్తలందరూ పార్టీ వెంటే ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కౌశిక్ రెడ్డి విజయం కోసం బీ ఆర్ ఎస్ శ్రేణులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేస్తారని, వ్యక్తులు ముఖ్యం కాదని పార్టీ ముఖ్యమని అయన స్పష్టం చేసారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News