హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai srinivas)పై కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్టుల కాలనీలో నివాసం ఉంటున్న ఆయన ఇంటికి వెళ్తున్న సమయంలో రాంగ్ రూట్‌లో కారు నడిపాడు. దీంతో అతడిని అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసుతో దురుసుగా ప్రవర్తించాడు. ఈ నేపథ్యంలో బెల్లంకొండపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
- Advertisement -
ఇక బెల్లంకొండ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన నటించిన ‘భైరవం’ చిత్రం మే30న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రలు పోషించడం విశేషం. అలాగే టైసన్ నాయుడు, హైందవ, కిష్కింధపూరి లాంటి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.