యూట్యూబర్ సన్నీ యాదవ్(Sunny Yadav)పై కేసు నమోదు అయింది. ఈ విషయాన్ని పోలీసులు ప్రకటించారు. సన్నీ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేయడంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar) స్పందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
- Advertisement -
“బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్సర్లపై నేను చేసిన ‘ఎక్స్’ పోస్ట్ ఆధారంగా కేసు నమోదు చేసిన తెలంగాణ డీజీపీ, సూర్యపేట ఎస్పీకి ధన్యవాదాలు. కాసులకు కక్కుర్తిపడి అమాయకుల ప్రాణాలను తీస్తామంటే నడవదు. చట్టప్రకారం మీరు శిక్ష అనుభవించాల్సిందే. మాకు మిలియన్లు, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు.. డబ్బు కోసం ఏమైనా చేస్తామంటే ఊచలు లెక్కపెట్ట తప్పదు” అని చురకలు అంటించారు. కాగా సజ్జనార్ పోస్టుతో ఇప్పటికే ఏపీలో యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.