మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం అర్థరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రూ.లక్షన్నర నగదుతో పాటు బంగారు అభరణాలను కూడా దోచుకెళ్లారు. పొన్నాల లక్ష్మయ్య సతీమణి అరుణా దేవి ఈ దోపిడీపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
- Advertisement -
పొన్నాల ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. సంఘటన జరిగిన సమయంలో పొన్నాల కుటుంబసభ్యులు ఎవరూ ఇంట్లో లేరని.. జనగాం జిల్లాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చోరీ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.