Sunday, October 6, 2024
HomeతెలంగాణCBI Enquiry : కవిత ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులు.. విచారణ ప్రారంభం

CBI Enquiry : కవిత ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులు.. విచారణ ప్రారంభం

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో.. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు కూడా వినిపించింది. ఈ రోజు ఆమెను ఆమె నివాసంలోనే సీబీఐ అధికారులు ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేశారు. ఉదయం 11 గంటలకు రెండు వాహనాల్లో ఎనిమిది మంది అధికారుల బృందం కవిత ఇంటికి వచ్చారు. ఇందులో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు. సీబీఐ విచారణ సందర్భంగా కవిత ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఇంటికి వెళ్లే దారిని రెండువైపులా పోలీసులు క్లోజ్ చేశారు.

- Advertisement -

సీబీఐ విచారణ నేపథ్యంలో.. కవిత అడ్వకేట్లు ఉదయమే ఆమె ఇంటికి చేరుకున్నారు. కవిత అడ్వొకేట్ల సమక్షంలోనే సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. అయితే ముందుగా అనుకున్న గదిలో కాకుండా.. మరో గదిలో కవితను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సీబీఐ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఇంటిముందు రాత్రికిరాత్రే ఫ్లెక్సీలు వెలిశాయి. ‘డాటర్‌ ఆఫ్‌ ఫైటర్‌ విల్‌ నెవర్‌ ఫియర్‌’ అంటూ పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సీబీఐ విచారణలో కవితకు స్కామ్ లో భాగమున్నట్లు తేలితే ఆమెను ముద్దాయిగా చేర్చే అవకాశాలు లేకపోలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News